birth anniversary of Birsa Munda
birth anniversary of Birsa Munda

birth anniversary of Birsa Munda: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి ప్రభుత్వాలు కృషి… కలెక్టర్ అభిలాష అభినవ్

birth anniversary of Birsa Munda: నిర్మల్, నవంబర్ 15 (మన బలగం): గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గిరిజన గౌరవ దినోత్సవ సమారోహం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా బీహార్ నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని జిల్లాల వారీగా గిరిజనులను ఉద్దేశించి మాట్లాడిన సందేశాన్ని దృశ్యమాలిక ద్వారా అధికారులు, గిరిజన ప్రజలు తిలకించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు.

జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద జిల్లాలో మొదటి దశగా ఎంపికైన 33 ఆవాసాలను అభివృద్ధి పర్చే దిశగా అధికారులు ప్రాధాన్యతపరంగా పనులు చేపట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో జీవనోపాధి, తాగునీరు, రహదారులు, అటవీ హక్కు చట్టం, విద్యుత్, వైద్య సౌకర్యంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పథకాలను అమలు పరిచేందుకు బ్లాకులు, మండల స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ అధికారిని నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి చందన పథకం లక్ష్యాలు, అమలు తీరును వివరించారు. అంతకుముందు గిరిజన సాంప్రదాయ బాలికలు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు, వివిధ గ్రామాల గిరిజన ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *