Raj Tarun: హీరో రాజ్ తరుణ్‌కు మంగళవారం నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనను విచారణకు రావాలని ఆదేశించారు. ఈనెల 18 లోపు తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో వెల్లడించారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద హీరో రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌తరుణ్, తాను 11 సంవత్సరాలుగా ప్రేమించు కుంటున్నామని, అనేకసార్లు శారీరకంగా కలిశామని లావణ్య పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం తనను వదిలించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం నడుపుతూ, తనను మోసం చేయాలని చూస్తున్నాడని వెల్లడించింది.
రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని, లేకపోతే తనను చంపేస్తానంటూ, అతడి సోదరుడు ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో డ్రగ్స్ కేసులో తనను ఇరికించారని, రాజ్‌తరుణ్ కోసం తాను 45 రోజులపాటు జైలులో ఉన్నానని స్పష్టం చేసింది. రాజ్‌తరుణ్ విచ్చలవిడిగా డ్రగ్స్‌కు అలవాటుపడి అమ్మాయిలతో పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రాన్ని చేర్చుతూ కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు వెల్లడించారు. ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద ముగ్గురిపైనా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13న లావణ్య ఆత్మహత్యాయత్నం చేసింది.