Whip Adluri Laxman Kumar: సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గురువారం ఆకస్మితంగా సందర్శించారు. హాస్పిటల్ సరౌండింగ్ తిరుగుతూ హాస్పిటల్లో ఉన్న పేషంట్లను వైద్యం ఏ విధంగా అందుతుందని నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో దవాఖానను మెరుగుపరుస్తామని, రోగులకు అందుబాటులో ఉండే విధంగా డాక్టర్ల సంఖ్యను పెంచుతామని, అన్ని సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ హాస్పిటల్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్ని రోజులుగా ప్రజలు విష జ్వరాలతో ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం అన్ని రకాల మెడిసిన్ అందుబాటులో ఉంచిందని తెలిపారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని దవాఖాన అధికారులకు సూచించారు.