The husband stabbed his wife: నిర్మల్, అక్టోబర్ 23 (మన బలగం): భార్యను భర్త కత్తితో పొడిచిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న నవనీతపై భర్త గోవింద్ కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కాపాడి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగానే ఘటనకు పూనుకున్నట్లు తెలుస్తోంది.