Why do women live longer
Why do women live longer

Why do women live longer?: స్త్రీలే ఎక్కవ కాలం ఎందుకు జీవిస్తారు?

శాస్త్రవేత్తల పరిశోధనలో మైండ్ బ్లోయింగ్ రీజన్స్

Why do women live longer?: పురుషులకంటే మహిళల జీవిత కాలం ఎక్కువ అని, ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పురుషులు, మహిళలపై నిర్వహించిన పరిశోధనల ఆధారంగా అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 సంవత్సరం గణాంకాల ప్రకారం పురుషుల సగటు ఆయుర్దాయం 68.4 సంవత్సలు ఉంటే మహిళలు 73.8 సంవత్సరాలు జీవిస్తున్నారు. వివిధ రకాల పరిశోధనల అనంతరం ఈ ఆయుర్దాయాన్ని శాస్ర్తవేత్తలు నిర్ధారించారు. మొత్తంమీద పురుషుల కన్నా మహిళలు ఐదేళ్లు ఎక్కువ జీవిస్తున్నారని స్పష్టమైంది.

రిస్క్ తీసుకోవడంలో ఎవరు ముందు?

హార్వర్డ్ హెల్త్ యూనివర్సిటీ ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ఆహార నిపుణుడు క్రిష్ అశోక్ అనేక విషయాలు స్పష్టం చేశారు. మగవారు స్ర్తీలకన్నా ముందుగా చనిపోవడానికి కారణాలను విశ్లేషించారు. దీన్ని ‘బయోలాజికల్ డెస్టినీ’గా పేర్కొన్నారు. పురుషులు ప్రమాదకర పనుల్లో ఎక్కువగా పాల్గొంటారని, స్ర్తీలు రిస్క్ తక్కువ తీసుకుంటారని వెల్లడించారు. మెదడు పనితీరులో కలిగే పరిణామాలే ఇందుకు కారణమని నిర్ధారించారు. మెదడులోని ఫ్రంటల్ లోబ్ అనే భాగం వ్యక్తుల తీర్పును, చర్య పరిణామాలను ప్రేరేపిస్తుంది. అయితే ఈ భాగం ఆడవారితో పోల్చితే అబ్బాయిలు, యువకుల్లో చాలా స్లోగా అభివృద్ధి చెందుతుంది. అలాగే బాలికలు, మహిళలకన్నా అబ్బాయిలు, పురుషులు ప్రమాదాలు, హింస వంటి కారణాలతో చనిపోతున్నారని హార్వర్డ్ అధ్యయనంలో తేలింది.

గుండెపోటు ఎవరిలో ఎక్కువ?

50 శాతం కన్నా ఎక్కువ మంది పురుషులు గుండె జబ్బుల కారణంగానే మరణిస్తున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గుండెపోటు, హార్ట్ స్ర్టోక్ రావడం స్త్రీలకన్నా పురుషుల్లోనే అధికం. ఇందుకు ప్రధాన కారణంగా పురుషుల్లో ఈస్ర్టోజన్ స్థాయిలు తక్కువగా ఉండడమేనని వెల్లడించింది. సరైన చికిత్స తీసుకోకపోవడంతో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అలాగే బీపీ, కొలెస్ర్టాల్ అధికంగా ఉండడం గుండెజబ్బులకు దారితీస్తోంది. మరణాల రేటు స్ర్తీల కన్నా పురుషుల్లోనే అధికమని తేల్చింది.

రోగ నిరోధక శక్తి ఎవరికి ఎక్కువ?

రోగనిరోధక విషయంలోనూ పురుషులకన్నా స్ర్తీలే ఎక్కువ బలంగా ఉంటారు. ఈస్ర్టోజన్ మహిళల రక్తంలో కొలెస్ర్టాల్‌ను సమ స్థాయిలో ఉంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. మహిళలు రెండు ఎక్స్ క్రోమోజోమ్‌లు కలిగి ఉంటారు. కానీ పురుషులు ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్‌లను కలిగి ఉంటారు. అయితే ఎక్స్ క్రోమోజోమ్‌లోని కొన్ని జన్యువులు పురుషుల్లో రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయని అధ్యయంలో గుర్తించారు.

ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనేది ఎవరు?

అనేక ఆరోగ్య సమస్యలకు ఒత్తిడే ప్రధానం కారణంగా గతంలోనూ పలు అధ్యయనాలు నిర్ధారించారు. ఒత్తిని పురుషులకన్నా మహిళలు సమర్ధవంతంగా నిర్వహిస్తారని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో నిరూపితమైంది. ఒత్తిడితోపాటు ఆందోళనకర విషయాల్లో ప్రతిస్పందించడం, నిరాశ చెందడం వంటిని సమతూకంగా నిర్వర్తిస్తారని అధ్యయనం తేల్చింది. మానసిక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే స్ర్తీలు ప్రవృత్తి, స్నేహాన్ని ఎంచుకుంటారు. అదే పురుషులు ఫైట్ లేదా ఫ్లైట్ విధానాన్ని అవలంబిస్తారు. అయితే సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు చుట్టుపక్కల వారి సహాయం కోరేందుకు వెనుకాడరు. కానీ పురుషులు సమస్యను బయటపెట్టడానికి ఇష్టపడరు అని అధ్యయనంలో వెల్లడైంది.

పెళ్లికాని స్ర్తీలు ఎక్కువ కాలం జీవిస్తారా?

పెళ్లైన మహిళలు బిడ్డలకు జన్మనిస్తే వారి జీవితాలను కోల్పోతారు. బిడ్డకు జన్మనివ్వడం తరువాత తరాన్ని కొనసాగించడానికి సహజ ప్రక్రియ. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నదనే భావన ఉంది. గర్భం దాల్చిన ప్రతి సారీ స్ర్తీల ఆయుష్షును తగ్గిస్తుంది. పెళ్లికాని వారి విషయంలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ బయాలజీలో 2006లో వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే, మహిళలు బిడ్డను కనే ప్రతి సారీ 95 వారాల జీవితాన్ని కోల్పోతారు. గర్భం దాల్చిన ప్రతి సారీ ఆరు నెలల నుంచి రెండేళ్ల మధ్య సెల్యులార్ ఏజింగ్ వేగంగా మారడమే కారణమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

పురుషుల జీవితకాలం పెంపు సాధ్యమేనా?

వైద్యుల అంచనాల ప్రకారం, జీవసంబంధమైన వాటిని మార్చే అవకాశం లేనప్పటికీ పురుషులు జీవితకాలం పెంచుకోవడానికి అనేక సూచనలు చేశారు. అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండాలి. అందుకు శారీరక వ్యాయామం తప్పనిసరి. తరచూ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. వీటితోపాటు ధూమపానం, మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. పౌష్టిక, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడంతోపాటు ఆయుప్రమాణాలు మెరుగవుతాయని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *