Farmer Mallaiah: చెక్ డ్యాములు నిర్మించాలని ఎవరిని కోరలేదు.. ఏ అధికారి చుట్టూ.. ఏ నాయకుని చుట్టూ తిరగలేదు.. నాయకులు వారి స్వలాభం కోసం నిర్మించిన చెక్ డాములు మా కొంపలు ముంచుతున్నాయని జిఎన్ఆర్ కాలనీవాసులతోపాటు రైతు మల్లయ్య మంత్రి ముందు మొరపెట్టుకున్నారు. గతంలో రెండు పంటలు పండించుకునే పచ్చని పంట పొలాలు ప్రతి ఏటా నీట మునిగి నష్టపోతున్నామని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దాపూర్ వాగుపై చెక్ డ్యామ్‌లను నిర్మించడం వల్ల నీటి నిలువ పెరిగి పంట పొలాల్లోకి వస్తున్నాయని, దీంతో ఇసుకమేటలు వేయడం, పంటలు నీట మునిగి నష్టపోతున్నామని అన్నారు. దీంతో స్పందించిన మంత్రి సాంకేతిక నిపుణులతో చర్చించి చెక్ డాముల ఎత్తు తగ్గించడమా.. తొలగించడమా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తాను ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవడానికి ఇంజనీర్‌ను కానని ఇంజనీర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని జిఎన్ఆర్ కాలనీవాసులకు, సిద్దాపూర్ వాగు పరిసర పంట భూముల రైతులకు మంత్రి హామీ ఇచ్చారు.