Selling liquor at high prices: బుగ్గారం, అక్టోబర్ 29 (మన బలగం): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ వైన్స్‌లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని బుగ్గారం వీడీసీ, ఎండీసీల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ, జిల్లా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బుగ్గారం మండల అభివృద్ధి కమిటీ కన్వీనర్ చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ, ఈ వైన్స్ ద్వారా మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాప్‌లకు అక్రమంగా, నాణ్యత లేని నాసిరకం కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. క్వార్టర్‌కు రూ.20, బీరుకు రూ.20, హాఫ్‌కు రూ.40, ఫుల్లుకు రూ.80 చొప్పున అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.