Inauguration of the library
Inauguration of the library

Inauguration of the library: రూమ్ టు రీడ్ ఇండియా గ్రంథాలయం ప్రారంభం

Inauguration of the library: ముధోల్, అక్టోబర్ 28 (మన బలగం): విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని బాసర మండల విద్యాధికారి జి.మైసాజి సూచించారు. బాసర మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో యూఎస్ఏ పౌరుల ఆర్థిక సాయంతో రూమ్ టు రీడ్ ఇండియా స్పాన్సర్‌షిప్ ద్వారా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో మోడల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేశారన్నారు. కలర్‌ఫుల్ పెయింటింగ్స్, ప్రత్యేక గ్రంథాలయ గది, విద్యార్థులు చదువుకోవడానికి అనుకూలంగా టేబుళ్లు, కార్పెట్, పుస్తకాలు అమర్చుకోవడానికి ర్యాక్స్, విద్యార్థులు గీసిన చిత్రాలు, రాసిన కథలు ప్రదర్శించడానికి పిన్‌బోర్డ్స్, తదితర సౌకర్యాలు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఎన్ఓ నర్సారెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నర్సయ్య, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తేజశ్రీ, ప్రధానోపాధ్యాయులు బి.గంగారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *