- ముబై టార్గెట్ 207
- గైక్వాడ్, దూబే హాఫ్ సెంచరీలు
- చివర్లో ధోనీ మెరుపులు
- హ్యాట్రిక్ సిక్సర్లు
CSK vs MI, IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన 29వ మ్యాచ్లో చెన్నై 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచిన ముంబై చన్నైను బ్యాటింగ్కు ఆహ్వానించింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 69(38) చేశాడు. శివందూబే ర2 సిక్సర్లు 10 ఫోర్లు కొట్టి 38 బంతుల్లో 66 పరుగులు చేశాడు. చివరి నాలుగు బంతులు మిగిలి ఉండగా వచ్చిన ధోనీ మెరుపులు మెరిపించాడు. రావడం రావడంతో సిక్సర్లు బాదాడు. వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. కేవలం నాలుగు బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. రహానే 5(8), రచిన్ రవీంద్ర 21(16), డారెన్ మిచెల్ 17(14) పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా 2, కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్ చెరో వికెట్ తీసుకున్నారు.
హోరెత్తిన స్టేడియం
చెన్నై భారీ స్కోర్ దిశగా సాగుతున్న సమయంలో 186 పరుగుల వద్ద 19.2 ఓవర్లో మిచెల్ ఔట్ అయ్యాడు. అప్పటికే ధోనీ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్న అభిమానులు మిచెల్ ఔట్ కావడంతో స్టేడియాన్ని హోరెత్తించారు. ధోని బ్యాటింగ్కు రావాలంటూ హర్షధ్వానాలు చేశారు. ధోని గ్రౌండ్లోకి అడుగు పెట్టడంతోనే అభిమానుల్లో ఉత్సాహం నెలకొన్నది. హ్యాట్రిక్ సిక్సులతో ధోనీ అభిమానుల పంట పండించారు. మొత్తం మీద మొదటి ఇన్నింగ్స్ అభిమానులకు పైసా వసూల్..!