Ayyappa Temple Anniversary: ధర్మపురి, నవంబర్ 29 (మన బలగం): ధర్మపురి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ 18వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి పడి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం విప్ దీక్షపరులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆలయ కమాన్ నిర్మాణం, తదితర సమస్యల పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.