Inspections by sanitary: జగిత్యాల, డిసెంబర్ 21 (మన బలగం): జగిత్యాల పట్టణంలో కొంత కాలంగా ఆహార కల్తీ నిరోధక అధికారుల ఆకస్మిక దాడుల్లో అనేక విషయాలు వెలుగుచుస్తున్నాయి. అదే కోవలో జగిత్యాల మునిసిపల్ శానిటరీ విభాగం అధికారులు, సిబ్బంది తమ పరిధిలో చేపడుతున్న తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచుస్తున్నాయి. శనివారం పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తాలోని ఫాస్ట్ ఫుడ్, మిర్చి బండ్లు, ఇతర ఆహార విక్రయ బండ్లను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పారిశుధ్య ప్రమాణాలను పాటించని పలువురిని హెచ్చరించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి, సిబ్బంది లక్ష్మణ్, లక్ష్మీనారాయణతోపాటు పలువురు ఉన్నారు.