Rukmapur Gurukula
 Rukmapur Gurukula

Rukmapur Gurukula: రుక్మాపూర్ గురుకుల సైనిక పాఠశాలలో అడ్మిషన్స్ ప్రారంభం

 Rukmapur Gurukula: ధర్మపురి, జనవరి 4 (మన బలగం): కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల, కళాశాల (బాలురు)లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. www.tgcet.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.04.2014 నుంచి 31.03.2016 మధ్యలో జన్మించి ఉండాలి. దరఖాస్తులు సమర్పించేందుకు ఫిబ్రవరి 1వ తేదీ ఆఖరు. రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల డైరెక్టర్ కల్నల్ కేసి రావు, ప్రిన్సిపాల్ జి.కాళహస్తి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *