Collection of signatures: ధర్మపురి, జనవరి 5 (మన బలగం): ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జాజాల రమేశ్ ఆధ్వర్యంలో నేరెళ్ల గ్రామపంచాయతీ ఆవరణలో నేరెళ్ల, గోవిందుపల్లె రైతుల సమావేశం ఆదివారం నిర్వహించారు. నేరెళ్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఏర్పాటుపై చర్చించారు. రైతుల అభిప్రాయం తీసుకొని సంతకాలు సేకరణ చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల కలెక్టర్, జిల్లా సహకార అధికారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ శేర్ల రాజేశం, డైరెక్టర్ జాజాల లక్ష్మీ వెంకన్న, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులు రెడ్డవేని సత్యం, కాంగ్రెస్ పార్టీ నేరెళ్ల అధ్యక్షుడు కసారాపు బలగౌడ్, గోవిందుపల్లె అధ్యక్షుడు పురంశెట్టి మల్లేశం, తాజా మాజీ ఉపసర్పంచులు జాజాల శంకర్, జిళ్ల మల్లేశం, నాయకులు పోతరాజు లింగారెడ్డి, పాల సంబేష్, ఉడుత గంగారాం, పలిగిరి లచన్న, జంగిలి తిరుపతి, పాదం శంకర్, చిన్న మినయ్య, జాజాల రవీందర్, కసరాపు సాంబయ్య, కరువత్తుల నాగరాజు, ఇరగదిండ్ల వేణు, ఈదునురి బక్కయ్య, కోదురుపాక మల్లేశం, వేముల మల్లేశం, మామిడిపెల్లి రాజయ్య, గోపాల్, గొర్రె నరేశ్, మడిశెట్టి లక్ష్మణ్, వడ్ల లచ్చన్న, వివిధ కుల సంఘాల నేతలు, రైతులు పాల్గొన్నారు.