Whip Laxman Kumar
Whip Laxman Kumar

Whip Laxman Kumar: ఆత్మరక్షణ కోసం ప్రతిఒక్కరూ మార్షల్ఆర్ట్స్ నేర్చుకోవాలి: ప్రభుత్వం విప్ లక్ష్మణ్ కుమార్

Whip Laxman Kumar: ధర్మపురి, జనవరి 5 (మన బలగం): ధర్మపురి పట్టణంలోని ఎస్.ఆర్. ఆర్ గార్డెన్స్‌లో డ్రాగన్ స్వార్డ్ కుంగ్ – పూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ టెస్ట్ ప్రోగ్రామ్‌లో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 150 మంది విద్యార్థులకు బెల్ట్‌లు, సర్టిఫికెట్లు అందజేసారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కుంగ్-పూ నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెంపొందడంతోపాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు, ఆత్మరక్షణ కోసం ప్రతిఒక్కరూ మార్షల్ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *