Vivekananda Jayanti: ధర్మపురి, జనవరి 12 (మన బలగం): ధర్మపురి పట్టణంలోని వివేకానంద చౌరస్తా వద్ద నిర్వహించిన వివేకానంద జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని 1981 ఎస్సెస్సీ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తంచేసారు. వివేకనంద మహోన్నతమైన వ్యక్తి అని, భారత దేశ ఖ్యాతిని అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు ప్రసంగాల ద్వారా పరిచయం చేసిన ఘనత వారికే దక్కుతుందని తెలిపారు. యువతకు ఆదర్శప్రాయంగా ఉంటూ, దిశా నిర్దేశం చేశారని కొనియాడారు. ధర్మపురి పట్టణంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.