SFI: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 23 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లిట్ మండల కేంద్రంలో ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జరిగే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాల్గవ మహాసభల కరపత్రాలు మోడల్ స్కూల్ ఆవరణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు జాలపెల్లి మనోజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ విద్యార్థుల పక్షాన నిలబడుతూ వారి సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న విద్యార్థుల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, జిల్లా వ్యాప్తంగా గురుకులాలు కేజీబీవీలు హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని, జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తులో విద్యారంగ అభివృద్ధి కొరకు నూతన కర్తవ్యాలు తీర్మానాల రూపొందించుకొని జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి నాలుగవ ఎస్ఎఫ్ఐ మహాసభలు ఉపయోగపడతాయని అన్నారు. మహాసభలను జిల్లాలో విద్యార్థులు మేధావులు ఉపాధ్యాయులు జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్, ప్రణయ్, వర్షిత్, ప్రవీణ్, వినయ్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.