Kolkata to the top.. Tough competition for other positions: ఐపీఎల్ సీజన్‌లో ఈ సారి చివరి లీగ్ మ్యాచ్ వరకు ప్లే ఆఫ్ బెర్తులు ఎవరికో అనే విషయం తేలేలా లేదు. కోల్‌కతా 19 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్ సంపాదించింది. కానీ ఇప్పటికే 14 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 3, 4 ప్లేస్‌లో ఉన్నాయి. చెన్నై ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.
ఆర్సీబీకి కూడా చివరిమ్యాచ్ ఉండగా.. అది చెన్నైతో జరగాల్సి ఉంది. దీంతో చెన్నై, ఆర్సీబీలలో ఎవరు గెలిస్తే వారికి నెట్ రన్ రేట్ మెరుగు పడి టాప్ ఫోర్‌లోకి వస్తుంది. ఓడిన జట్టు అయిదో స్థానానికి పడిపోతుంది. సన్ రైజర్స్ జట్టు రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. గుజరాత్, పంజాబ్ లాంటి ఎలిమినేట్ అయిన టీంలతో ఆడటం కాస్త అనుకూలించే విషయం.
రెండు మ్యాచుల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ఒక్కటి గెలిచినా నెట్ రన్ రేట్ మెరుగుపడి కూడా ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ లక్నో సూపర్ గెయింట్స్ కూడా 12 మ్యాచులు ఆడి ఆరింట్లో విజయం సాధించింది. ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. రెండింట్లో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. దీంతో లక్నో కూడా ఇంకా రేసులోనే ఉంది. కానీ లక్నో రెండు మ్యాచుల్లో భారీ విజయం సాధించాలి.
రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా వేరేలా మారిపోయింది. 8 విజయాలతో మొన్నటి వరకు మొదటి స్థానంలో ఉన్న రాజస్థాన్ వరుసగా నాలుగు మ్యాచులు ఓడిపోవడంతో రేసులో వెనకబడింది. అయినా ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. ఒక్క దాంట్లో గెలిచినా.. ప్లే ఆఫ్‌కు వెళుతుంది. ఒక వేళ రెండింట్లో ఓడిపోయినా కూడా నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంటే వెళ్లే అవకాశం ఉంటుంది.