Prajavani: నిర్మల్, మార్చి 10 (మన బలగం): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఆమె పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, భూ సంబంధిత, అటవీ, వ్యవసాయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్, రేషన్ కార్డులు వంటి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రజలు అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.