- సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకం
- వారి సమస్యల పరిష్కారానికి కృషి
- నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Nirmal Press Club: నిర్మల్, జూన్ 28 (మన బలగం): పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని బీజేపీ సభా పక్ష నేత నియోజకవర్గ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఇటీవల నూతనంగా ఎన్నికైన నిర్మల్ ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. సమాజంలో పాత్రికేయుల వృత్తి ఎంతో గౌరవప్రదమైందని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులచే ఆయన ప్రమాణస్వీకారం చేయించి కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.
సంఘటితంగా ముందుకు వెళ్లాలి: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
పాత్రికేయులంతా సంఘటితంగా ముందుకు వెళ్లాలని మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పాత్రికేయుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై కార్యవర్గ సభ్యులను అభినందించి సన్మానించారు. పాత్రికేయులంతా ఒక్కతాటికి చేరడం శుభ పరిణామాన్ని అన్నారు.
ప్రభుత్వ సహకారం అందిస్తాం: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి రావు
ప్రభుత్వపరంగా పాత్రికేయులకు అందే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి ఘనంగా సన్మానించారు.
అధ్యక్షులుగా రాసం శ్రీధర్
నూతన కమిటీ అధ్యక్షులుగా రాసం శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా బాస లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా రాంపెల్లి నరేందర్, పూసాల పోశెట్టి, యోగేష్, ఇఫ్తేకర్ అహ్మద్, కోశాధికారిగా కోడూరు సందీప్, సాహకోశాధికారిగా రామెల్ల రాజేశ్వర్, సాంస్కృతిక కార్యదర్శిగా బొడ్డు వేణుగోపాల్ గౌడ్, కార్యదర్శులుగా మండాజీ మారుతి, బొద్దుల భాను, వసీవుల్లా ఖాన్, ప్రచార కార్యదర్శిగా శివకుమార్, కార్యనిర్వహణ కార్యదర్శిగా జగన్నాథం శ్రీనివాసా చారి, సంయుక్త కార్యదర్శిగా వాకులాభరణం ప్రశాంత్, కార్యవర్గ సభ్యులుగా జల్ద మనోజ్, బత్తూరికైలాస్, చందుల సాయన్న, పసుపుల రాజేష్, మోసిన్ బిన్ మహమ్మద్, గౌరవ సభ్యులుగా ధర్మపురి శ్రీనివాస స్వామి, కొండూరి రవీందర్, వెంకగారి భూమయ్య, రామ్ మహేందర్, మహేష్ రావు, గుమ్ముల అశోక్, రామేశ్వర్, ఎమ్మే వసీం, ముఖిమ్ ఎన్నికయ్యారు. వీరిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్ అలీ, పెన్షనర్ సంఘ జాతీయ నేత ఎంసీ లింగన్న, సభ్యులు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మురళీధర్ సీనియర్ వైద్యులు చక్రధారి, రమేష్ రెడ్డి, చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం, కర్ర సంఘం, టీఎన్జీవోల సంఘం, కిరాణా అసోసియేషన్, ఉపాధ్యాయ సంఘం నేతలు, వివిధ కుల సంఘ సభ్యులు పలువురు ఘనంగా సన్మానించారు.
