Ambakanti Man Dies of Illness in Sharjah; Mortal Remains to Reach India: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంబకంటి గ్రామానికి చెందిన బొల్లపల్లి రవికుమార్(30) షార్జా దేశంలో అనారోగ్యంతో చనిపోయాడు. ఉపాధి కోసం ఏడు ఏళ్ల క్రితం జోర్డాన్ దేశంలో ఎర్బిడ్ పట్టణంలో గల క్లాసిక్ ఫ్యాషన్ అప్పరెల్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేసాడు. ఆరు నెలల క్రితం చుట్టిలో ఇండియాకు వచ్చి మళ్లీ వెళ్లాడు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో సదరు కంపెనీ యాజమాన్యం ఇండియా వెళ్లి చికిత్సా తీసుకోవాలని సూచించారు. ఆయనతోపాటు అదే కంపనీలో హెల్పర్‌గా పని చేస్తున్నా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాంపాల్‌ను తోడుగా ఇచ్చి ఇండియా పంపగా అమ్మన్ పోర్ట్ నుంచి షార్జా వయా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావలసి ఉంది. కానీ, షార్జా ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు.
ఇది గమనించిన ఏయిర్ అరేబియా విమాన సిబ్బంది షార్జాలోని ఆల్ క్వాసిమీ హాస్పిటల్‌కు తరలించగా, చికిత్సా పొందుతూ ఆగస్ట్ 30 నాడు తుది శ్వాస విడిచాడు. మృతునికి 3 ఏండ్ల కింద వివాహం కాగా భార్య తల్లిదండ్రులు ఉన్నారు. ఎన్అర్ఐ అడ్వైజరీ కమిటీ మెంబెర్‌కు రవి కుమార్ స్నేహితులు అలాగే జోర్డాన్‌లోని కంపెనీ మిత్రులు ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ మెంబర్ స్వదేశ్ పరికిపండ్లకు సమాచారం అందించగా తక్షణమే దుబాయ్‌లో ఉన్న రాయబార కార్యాలయానికి లేఖ రాయడమే గాక మృతదేహాన్ని ఇండియా తీసుకురావడానికి ఇండియన్ సామాజిక కార్యకర్త గుండెల్లి నరసింహ, నరేందర్ కృషి చేశారు. శుక్రవారం షార్జా నుంచి ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మృతదేహం చేరనుంది. అదే రోజు స్వగ్రామానికి తీసుకువచ్చి కార్యక్రమాలు చేయనున్నారు.
