MLA Vedma Bojju Patel Performs Durga Mata Pooja at Ambedkar Nagar: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో నెలకొల్పిన దుర్గామాతను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కుటుంబ సమేతంగా ఆదివారం వెళ్లి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దసరా ఉత్సవాలలో భాగంగా దుర్గామాత అమ్మ వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలతో పాడిపంటలతో నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, అమ్మవారి దయ ఉండాలని అన్నారు. అంబేద్కర్ నగర్ దుర్గామాత ఉత్సవ సమితి సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు పూజాది కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ భర్త జన్నారపు శంకర్, మూడో వార్డ్ కాంగ్రెస్ ఇన్‌చార్జి మ్యాదరి రాజేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండు రాజేశ్వర్, కుంటాల రాజన్న, దాసరి రాజేశ్వర్, నాయిని శంకర్, చెట్పెల్లి మోహన్, పంబాల చిన్నయ్య, రాకేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
