Bathukamma Celebrations Organized by RBVRR Society in Nirmal
Bathukamma Celebrations Organized by RBVRR Society in Nirmal

Bathukamma Celebrations Organized by RBVRR Society in Nirmal: సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Bathukamma Celebrations Organized by RBVRR Society in Nirmal: జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఆర్.బి.వి.ఆర్.ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ వేడుకలను సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి కవిత రెడ్డి హాజరయ్యారు. ముందుగా బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి, కోలాటలు వేస్తూ.. బతుకమ్మ ఆడారు. దీంతో ఫంక్షన్ హాల్ ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి కవిత రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండుగ ఒక నిదర్శనమన్నారు. గౌరీ దేవి ఆశీస్సులతో అందరికీ మంచి ఆరోగ్యం సమకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వడ్డీ రాజేందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి దామోదర్ రెడ్డి, సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Bathukamma Celebrations Organized by RBVRR Society in Nirmal
Bathukamma Celebrations Organized by RBVRR Society in Nirmal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *