అలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
చిన్నారులను అభినందించిన నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ
Telangana state formation celebrations: ఉడుకు నీళ్లు తానం పోస్తే పెయ్యి కాలుతుందన్నావు బిడ్డా.. ఉడుకుడుకు బువ్వల చెయ్యి కాలిందని ఊదుకుంటూ తిన్నావు బిడ్డా.. పెట్రోలు పోసుకొని ఒంటికి నిప్పంటించుకుంటే ఎట్లా తట్టుకున్నావు బిడ్డా.. అంటూ ఉద్యమ కాలంలో ప్రాణ త్యాగాలు చేసిన వారిపై రచించిన పాటపై చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి..
స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో బలిదానం చేసిన అమరుల ప్రాణత్యాగాలను వివరిస్తూ చిన్నారులు చేసిన నృత్యాలు అల్లరించాయి. నిర్మల్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పాటు జిల్లాలోని కుబీర్ విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లా అధికారులను మంత్రముగ్ధులను చేశాయి.కనురెప్ప వాల్చకుండా చిన్నారుల నృత్యాలను జిల్లా కలెక్టర్, ఎస్పీలు తిలకించారు. ఈ కార్యక్రమాలకు జిల్లా స్థాయి అధికారులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్యాలను ప్రతి ఒక్కరు తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించుకున్నారు.