First Ekadashi: హిందూ పండుగలలో తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. తొలి ఏకాదశి రోజున స్వామి వారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని పుణాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఏకాదశిని దేవశయని ఏకాదశి అని సైతం అంటారు. ఆషాఢ మాసం శుక్ల పక్షంలోని 11వ రోజున ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు విష్ణువును పూజిస్తారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి క్షీర సాగరంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లే నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసంగా పేర్కొంటారు. ఈ రోజుల్లో శుభకార్యాలు చేయరాదు. దృక్ పంచాంగం ప్రకారం దేవశయని ఏకాదశి వ్రతాన్ని ఈ ఏడాది జులై 17వ తేదీ బుధవారం నిర్వహిస్తారు. దేవశయని ఏకాదశి రోజున చేయకూడని పనులు సైతం ఉన్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండాలి. విష్ణువు నామాలు పారాయణం చేయాలి. ఇ
లా చేయడం ద్వారా విష్ణుమూర్తితోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన వాటిల్లో తులసీ ఆకులు ఒకటి. తులసీ దళం సమర్పించకుండా విష్ణుపూజ చేయడం అసంపూర్ణంగా భావిస్తుంటారు. శ్రీమహా విష్ణు దర్శనానికి వెళ్లినా, పూజ చేసినా తప్పనిసరిగా తులసీ ఆకులు సమర్పించాల్సిందే. తొలి ఏకాదశి రోజున ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. అంటే బియ్యంతో తయారు చేసిన ఎలాంటి పదార్థాలను భుజించకూడదు. ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకుంటూ దీక్ష కొనసాగించొచ్చు. మాంసం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని వినియోగించరాదు. ఎందుకంటే ఇవి మనసులో ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తాయి. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేయక పోయినా… దానం మాత్రం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. బియ్యం, బట్టలు, డబ్బులు, నీళ్లు ఇలా ఏదైనా దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు.
దేవశయని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే పుణ్యఫలం లభిస్తుందని చెబుతున్నారు. తొలి ఏకాదశి వ్రతం రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. భక్తులు తమ శరీరం, మనస్సుపై నియంత్రణ ఉంచుకోవాలి. విష్ణు మంత్రాలను స్తుతిస్తూ, రోజంతా గడవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. తొలి ఏకాదశి రోజున ఉపవాసం దీక్షలో ఉంటారు కాబట్టి అన్నం భుజించకూడదు. అంటే వండిన ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. పండ్లు, ఫలాలు తీసుకోవచ్చు. ఆహారానికి మాత్రం దూరంగా ఉండడం ఉత్తమమం. ఏకాదశి రోజున విష్ణు నామాలు జపిస్తూ ఉండాలి. తద్వారా ఏకాదశి ఫలాలను పొందుతారు. విష్ణు ఆరాధనతో పుణ్యంతో పాటు మోక్షం పొందవచ్చని పురణాలు ఘోషిస్తున్నాయి.