Prohibition of begging
Prohibition of begging

Prohibition of begging: నిర్మల్‌లో భిక్షాటన నిషేధం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

  • ఒకటో తేదీ నుంచి ఇంప్లిమెంట్
  • పోలీసులతో ప్రత్యేక తనిఖీలు

Prohibition of begging: నిర్మల్, డిసెంబర్ 28 (మన బలగం): భిక్షాటన నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
శనివారం పట్టణంలోని బాలల సంక్షేమ కమిటీ కార్యాలయాన్ని ఆమె స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి సందర్శించారు. జిల్లాలో కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, బాల్యవివాహాల నియంత్రణ, అనాథ బాలల గుర్తింపు, తదితర అంశాలపై సీడబ్ల్యూసీ సభ్యులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జనవరి 1 నుంచి భిక్షాటన నియంత్రించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భిక్షాటన నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాలని సూచించారు. పట్టణాలలోని ముఖ్య కూడళ్లలో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి, పునరావాస కేంద్రాలను తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలలో భిక్షగాళ్లకు ఆశ్రయం, ఆహారం, విద్య, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించాలని తెలిపారు. భిక్షాటనను నియంత్రించేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. భిక్షాటనను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖ ద్వారా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి భిక్షాటన నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే జిల్లాలో బాల్యవివాహాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాల్య వివాహాలు చేసిన, ప్రోత్సహించిన సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మురళి, సభ్యులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *