Eye Medical Camp: ఇబ్రహీంపట్నం, నవంబర్ 18 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇబ్రహీంపట్నం ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు గుడ ఎలిసె శాంత భూషణ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు క్యాంపు ఉంటుందని, గ్రామస్తులు, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాంపు అనంతరం కరీంనగర్‌లోని రెకుర్తిలో ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించుకునే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు వెంట తెచ్చుకోవాలని లయన్స్ క్లబ్ చైర్మన్ భూషణ్ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు శిబిరంలో పాల్గొని విజయవతం చేయాలని కోరారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ బోనగిరి భూమేశ్, ట్రెజరరి మార బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.