MLA Adluri Laxman: ధర్మపురి, జనవరి23 (మన బలగం): ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించేందుకే గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురువారం ధర్మపురి పట్టణంలోని 13, 15 వార్డుల్లో, ఎండపెల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క అధికారి వచ్చి రేషన్ కార్డులను ఇస్తామని, ఇళ్లను ఇస్తామని మీటింగ్ పెట్టి ఒక్క దరఖాస్తు తీసుకోలేదన్నారు. అర్హులైన పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందివ్వాలని గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్, కౌన్సిలర్, అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.