Holi celebrations: నిర్మల్, మార్చి 14 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. యువకులు, పెద్దలు, చిన్నారులు హోలీ సంబురాల్లో మునిగిపోయారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ వేడుకలు ఆనందంగా జరుపుకొన్నారు. యువకులు బైకులపై చక్కర్లు కొడుతూ కోలాహలం చేశారు. మహిళలు సైతం తమ స్నేహితులతో హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హోలీకి ముందు రోజు గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని కాలనీల్లోని ప్రధాన కూడల్లలో కామదహనం నిర్వహించారు. నిర్మల్ పట్టణంలో హోలీ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.
