Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: కేటీర్…మీ అయ్య ఫాంహౌజ్ ముందు ధర్నా చెయ్!

  • ఆనాడు రాడార్ వ్యవస్థకు ఎందుకు అనుమతి ఇచ్చారో నిలదియ్
  • కేసీఆర్ ఎలా ఆమోదం తెలిపాడో అడుగు
  • మీరే అనుమతి ఇచ్చి మీరే వ్యతిరేకిస్తారా?
  • దేశ భద్రతకు నష్టం
  • దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్లే
  • ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా మార్పు రాలేదు
  • బీఆర్ఎస్ తీరుపై బండి సంజయ్ ఘాటు విమర్శలు

Bandi Sanjay: మనబలగం, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పినా మార్పు రాలేదని, ఇంకా ద్వంద్వ రీతిలో వ్యవహరిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో వెరీ లో ఫ్రీక్వెన్సీ (వి.ఎల్.ఎఫ్) ప్రసార స్టేషన్‌ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం ఇప్పటిది కాదని అన్నారు. పద్నాగేళ్లుగా పెండింగ్‌లో ఉందని, అన్ని అడ్డంకులు దాటుకుని మంగళవారం భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పదేపదే చొరవ తీసుకోవడంవల్లే ఇది సాధ్యమైందన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని, వికారాబాద్ మండలం పూడురు పరిధిలోని దామగూడెం రిజర్వు ఫారెస్ట్‌లో 1174 హెక్టార్ల భూమిని (దాదాపు2900 ఎకరాలు) ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు బదిలీ చేస్తూ 2017న డిసెంబర్ 19న జీవో నెం.44 జారీ చేసిందని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమోదించిన బీఆర్ఎస్ నేతలే ఈరోజు వ్యతిరేకిస్తున్నారంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. వాళ్ల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. పైగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన వ్యవస్థను ఆయన కొడుకు ఆధ్వర్యంలో పార్టీ నేతలు వ్యతిరేంచడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ ఆనాడు సోయిలో ఉండే అనుమతి ఇచ్చారా? లేదా? తెలుసుకుంటే బాగుండేదని హితువు పలికారు.

కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఫాంహౌజ్ ఎదుట ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. రాడార్ వ్యవస్థకు సంబంధించి భూముల బదలాయింపునకు ఎందుకు అంగీకారం నిలదీయాలని సూచించారు. దేశ భద్రత అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు రాజీ లేకుండా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించడమంటే దేశ భద్రతను వ్యతిరేకిస్తున్నట్లేనన్నారు. దేశ రక్షణ వ్యవస్థలను అవమానించిట్లేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరును అసహ్యించుకుంటున్నారని తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాకపోవడం సిగ్గు చేటని బండి సంజయ్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *