Mahesh babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు శుక్రవారంతో 49వ పడిలో అడుగుపెట్టాడు. మహేశ్ బాబుకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు విషెస్ తెలియజేశారు. ఈ రోజ మురారి రీ రిలీజ్ కావడంతో థియేటర్లలో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. మహేశ్ కుమారుడు గౌతమ్, సూపర్ స్టార్ గారాల పట్టి సితార సోషల్ మీడియా వేదికగా తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా.. మీరు చేసే ప్రతి పనిలోనూ మీరే మా సూపర్ స్టార్. ఈ రోజే కాదు ప్రతి రోజూ మీకు అద్భుతమైన రోజు కావాలని కోరుకుంటున్నాను.’ అని గౌతమ్ పోస్ట్ చేశారు.
‘ఈ ప్రపంచంలో మీరే ఉత్తమ తండ్రి. పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ సితార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టిన మహేశ్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నారు. ఈ మూవీ కోసం మహేశ్ జుట్టు, బాడీ పెంచి లుక్ మార్చుకునే పనిలో పడ్డారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే పూజా కార్యక్రమాలతో మూవీకి కొబ్బరికాయ కొడతారని సమాచారం.