Dance performance: నిర్మల్, నవంబర్ 10 (మన బలగం): కార్తిక మాసాన్ని పురస్కరించుకొని భారత్ ఆర్ట్స్ అకాడమీ, రామ్‌లల్లా సంగీత నిత్యార్చన వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడికి దేశంలోని అన్ని రాష్ట్రాల వారు ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొనడానికి వెళుతుంటారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్మల్‌కు చెందిన సుంకరి ప్రమీల- మహేశ్ దంపతుల కుమార్తె సహస్ర నాట్య గురువు నవ్య ఆధ్వర్యంలో పాల్గొని ప్రతిభ చాటింది. సహస్ర జిల్లా కేంద్రంలోని వాసవి వరల్డ్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్యకు వెళ్లి నృత్య ప్రదర్శన చేసి జిల్లాకు మంచి పేరు తెచ్చినందుకు పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ఎంతగానో గర్వపడ్డారు. ఈ సందర్భంగా ఆ చిన్నారికి రాముడు ప్రతిమను బహుమానంగా అందజేశారు.