Nirmal Number One Ganesh Gajamala 2025: నిర్మల్ పట్టణంలోని బుధవారపేట్ నంబర్ వన్ గణేశుడికి భక్తురాలు నరిమెట్ల శశికళ భక్తి శ్రద్ధలతో భారీ గజమాల సమర్పించారు. ఈ సందర్భంగా నంబర్ వన్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు శశికళ భక్తి భావాన్ని కొనియాడుతూ, వారి కుటుంబానికి వినాయక స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.