BJP: నిర్మల్, మార్చి 16 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ (ఒకే దేశం – ఒకే ఎన్నిక) కార్యవాహ నిర్వహణ జిల్లా కన్వీనర్ అచ్యుత్ రావ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు రితేశ్ రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఒకే ఎన్నిక నిర్వహణ ద్వారా ఎన్నికల నిర్వహణ ఖర్చుల మిగులు, నిరంతర అభివృద్ధి వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ప్రతీ గ్రామానికి ఓకే దేశం – ఒకే ఎన్నిక అనే అంశాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న 2029 లో కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ (వన్ నేషన్ వన్ ఎలక్షన్)ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, పడిపెల్లి గంగాధర్, చిన్నారెడ్డి, రవీందర్ రెడ్డి, సతీశ్ రావు, శ్రీనివాస్, అశోక్, సాయినాథ్‌తో పాటు మండల కన్వీనర్లు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.