Palabhishekam: ధర్మపురి, జనవరి 4 (మన బలగం): ధర్మపురిలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కుమ్మరి తిరుపతి, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నాయకులు నిరసన తెలుపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వడ్డీ లేని రుణ పథకం కింద ర.1,50,000 కోట్లు కేటాయించిందన్నారు. అర్బన్ చాలెంజ్ కింద రూ.10 వేలు కోట్లు రానున్నాయని వివరించారు. ఉపాధి హామీ పథకానికి 85 వేల కోట్లు వీడుదల చేయనున్నారని తెలిపారు. గ్రామీణ సడక్ యోజనకు రూ.16,600 కోట్లు కేటాయించిందన్నారు. ఆసరా పింఛన్లు కింద రూ.96 వేల 32 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఇండ్ల నిర్మాణానికి రూ.1,97,494 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణానికి 32,400 కోట్లు, ఆవాస్ ఇంటి రుణమాఫీ కింద రూ.2500 కోట్లు తెలంగాణకు కేటాయించిందని వివరించారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్ కింద రూ.5300 కోట్లు కేటాయిస్తే ఇంగిత జ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులు నిరసన తెలుపడం సిగ్గుచేట్టన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు నలమాస్ వైకుంఠం, కస్తూరి మురళి, స్తంభంకాడి శ్యామ్, అయ్యోరి సత్యనారాయణ, గడ్డం శంకర్, శ్యామ్ రావు నాగులు, సోగల కిషన్, యాదగిరి కొమురయ్య, సుంకం మధుసూదన్, కోడిగంటి కిరణ్, గంధం సాయన్న, బాకీ అనిల్, అప్పం శీను, మల్లేష్, అంజన్న మండల సూరజ్, కిషన్, పాకాల సాయి, కాశిట్టి హరీష్, కలకోట రాజు, ఉయ్యాల వెంకటేష్, వొడ్డేటి మల్లేష్, కోల గంగాధర్ పాల్గొన్నారు.