Minority Welfare Officer: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 5 (మన బలగం): జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ భారతికి మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమె జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు జిల్లా అధికారులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.