Financial assistance: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: బాలుడి వైద్యానికి జిల్లా కలెక్టర్ ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రమావత్ చందు కొడుకు రమావత్ రోహిత్ ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలోని బీసీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నాడు. ఇటీవల పాముకాటుతో గాయపడి దవాఖానలో చికిత్స పొందాడు. వైద్య ఖర్చులకు సంబంధించి రూ.1 లక్ష 50 వేల చెక్కును రమావత్ చందు భార్య రజితకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం అందజేశారు. అలాగే విద్యార్థికి పదో తరగతి దాకా మెరుగైన విద్యను అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.