2K Run
2K Run

2K Run: నిర్మల్‌లో 2కే రన్

అధికారులు అభివృద్ధిలో సహకరించాలి: అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
2K Run: నిర్మల్, డిసెంబర్ 3 (మన బలగం): అధికారులు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలను అందించాలని జిల్లా ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా 3వరోజు మున్సిపల్, జిల్లా యువజన క్రీడల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 కే రన్‌ను మంగళవారం ఉదయం పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జండా ఊపి ప్రారంభించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందున ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రతి అధికారి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు అదనపు కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, డీఈవో, పి.రామారావు, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, డీసీవో రాజమల్లు, తహసీల్దార్ రాజు, గిరిజన క్రీడా అధికారి భుక్యా రమేశ్, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

2K Run
2K Run

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *