Datta jayanti: నిర్మల్, డిసెంబర్ 15 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయి బాబా, దత్తాత్రేయ నగర్ కాలనీలోని దత్తాత్రేయ దేవాలయంలో ఆదివారం నిర్వహించిన దత్త జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయుడు, సాయిబాబాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు తీర్థప్రసాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు.
శ్రీ మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్‌పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో నిర్మల్ జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీహరి రావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్రీహరిరావుతో పాటు నిర్మల్ పురపాలక సంఘం అధ్యక్షులు గండ్రత్ ఈశ్వర్, సారంగపూర్, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, సోమ భీమ్ రెడ్డి, శ్రీనివాస్, నందెడపు చిన్ను, ఎంబడి రాజేశ్వర్, నిర్మల్, సోన్ మండల పార్టీ అధ్యక్షులు కుంట వేణుగోపాల్, మధుకర్ రెడ్డి, శామకూర రాము, గంగారెడ్డి, రవీందర్ రెడ్డి, వంశీ, చిరంజీవి, కొడుకల శ్రీకాంత్, గులే రాజన్న, సంతోష్, కొంతం గణేశ్, ఫ్లెక్స్ శ్రీకాంత్, పెండెం శ్రీనివాస్, గంగోని భూరాజ్, పూదరి అరవింద్, గడ్డింటి ప్రశాంత్, తదితరులు ఉన్నారు.