vehicles Distribution: నిర్మల్, అక్టోబర్ 14 (మన బలగం): ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నరసింహారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పలువురు ఎస్సీ, ఎస్టీ, మహిళా లబ్ధిదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ వారి ఆధ్వర్యంలో ముద్ర, స్టాండప్ ఇండియా పథకాల లో భాగంగా లబ్ధిదారులకు 12 ఆటోలు, మూడు కార్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నరసింహ రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రాజేశ్వర్ గౌడ్, ఎంఎస్ఎంఈ చీఫ్ అశోక్, లబ్ధిదారులు, బ్యాంకు అధికారులు, ఇతర అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.