Ganesh immersion arrangements: వినాయక నిమజ్జన శోభాయాత్రకు నిర్మల్ పట్టణం సర్వం సిద్దమైంది. వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రధానకూడళ్లలో కాషాయ జెండాలతో అలంకరించారు. మరోవైపు సేవాపరులు సేవా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి శోభాయాత్రలో పాల్గొన్నవారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా, ద్యాగవాడ, గాంధీ చౌక్ తదితర ప్రాంతాల్లో సుమారు 20 వేల మందికి సరిపడా అల్పాహారం పులిహోర, వెజ్ బిర్యానీ, ఉప్మా, వాటర్ పాకెట్స్ పంపిణీ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ నిమజ్జనం జరిగినే బంగల్‌పేట్ వినాయక్ సాగర్ చెరువు వద్ద 10 వేల మందికి అన్నప్రసాదం అందజేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.