Review of Industries
Review of Industries

Review of Industries: పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యతనివ్వండి

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
Review of Industries: నిర్మల్, అక్టోబర్ 18 (మన బలగం): నూతన పరిశ్రమల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీఎస్ ఐపాస్ వెబ్ సైట్ లో నూతన పరిశ్రమల కోసం వచ్చిన దరఖాస్తులకు అనుమతుల జారీ పారదర్శకంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులు, అనుమతి, తిరస్కరణ కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నియమాలు పాటించిన వారికి మాత్రమే పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్నారు. సంబంధిత అన్ని ధృపత్రాలు జాగ్రత్తగా సరిచూడాలన్నారు.

ఒకవేళ దరఖాస్తును తిరస్కరించినట్లయితే వాటికి గల కారణాలను దరఖాస్తు ఫారంలో పొందుపరుచలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పీఎం విశ్వకర్మ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల నుంచి దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ మండల కార్యాలయాల్లో ఈ పథకంపై అవగాహన కలిగేలా సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించిన మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ నరసింహారెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, జిల్లా ఎస్పీ సంక్షేమ అధికారి రాజేశ్వర్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *