High mast light: నిర్మల్, నవంబర్ 15 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తాలో హైమాస్ట్ లైట్ల భారీ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు. సొసైటీ జిల్లా వ్యవస్థాపకులు అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా గతంలో రోడ్ డివైడర్లను నిర్మించే సమయంలో స్థానికంగా ఉన్న భారీ హైమాస్ట్ లైట్ల స్తంభాన్ని తొలగించిన అధికారులు తిరిగి ఏర్పాటు చేయలేదన్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వెంటనే లైట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ మతిన్, సొసైటీ గౌరవ అధ్యక్షులు ఎంఏ ఖదీర్, పట్టణ ప్రధాన కార్యదర్శి శేఖ్ ఇంతియాజ్, మహమ్మద్ ఇస్మాయిల్, సయ్యద్ ఇబ్రహీం, మహమ్మద్ కలీం, సైఫ్ ఖాన్ తదితరులు ఉన్నారు.