Jagityala SP Ashok Kumar: జగిత్యాల, అక్టోబర్ 11 (మన బలగం): దసరా పండుగను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రత పరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం జంబీ గద్దె ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని కోరారు. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దసరా పండుగను, దుర్గ నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణం లో సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసులకు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో జమ్మి చెట్టు పూజా, నరకాసుర వధ జరేగే జంబిగద్దె ప్రాంతాన్ని పరిశిలించి భద్రత పరంగా చేయవల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్, రూరల్ సి.ఐ కృష్ణా రెడ్డి, ఎస్. ఐ సదాకార్ ఉన్నారు.