LRS
LRS

LRS: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

LRS: నిర్మల్, డిసెంబర్ 10 (మన బలగం): ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ (ఎల్ ఆర్ఎస్) కింద వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో మున్సిపాలిటీల పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాలలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, అవసరమైన వివరాలను సేకరించాలని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపల్ కమిషనర్లు ఖమర్ అహ్మద్, మనోహర్, రాజేశ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *