- ఆయన మృతికి మంత్రి సీతక్క దిగ్భ్రాంతి
- గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి కనకరాజు
Padma Shri Kanaka Raju passed away: మన బలగం, తెలంగాణ బ్యూరో: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మార్లవాయి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మరణంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. మూలన పడిపోతున్న గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కనకరాజు పద్మశ్రీ అవార్డును కైవసం చేసుకున్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలంటే ప్రాణమిచ్చే కనకరాజు మరణం కళా ప్రపంచానికి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.