Prajavani cancellation: నిర్మల్, నవంబర్ 9 (మన బలగం): నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో సోమవారం (11.11.2024) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర సర్వేలో ప్రజలు అధికారులకు పూర్తి సమాచారం అందించి సహకరించాలని కోరారు. ప్రజావాణి రద్దు చేయడంతో ప్రజలెవరూ సోమవారం కలెక్టర్ కార్యాలయానికి రాకూడదని, సర్వేలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.