Purchase of grain
Purchase of grain

Purchase of grain: నాణ్యతాయుతంగా వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలి.. నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్

Purchase of grain: నిర్మల్, అక్టోబర్ 17 (మన బలగం): నాణ్యత ప్రమాణాలు పాటించి వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో గ్రామీణభివృద్ధి సంస్థ, సమాఖ్య సంఘాలు, డిసిఎచ్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి ఆమె సందర్శించారు. ధాన్యం నిల్వలను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎం ఎస్ పి కంటే తక్కువకు కొనుగోలు చేయరాదన్నారు. రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోళ్లు జరిపితే కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వేయింగ్ మిషన్, ప్యాడి క్లీనర్, టార్పా లీన్, గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిఎం సివిల్ సప్లయ్ వేణుగోపాల్ కు సూచించారు. ప్రతి బ్యాగ్ లో 40కేజీల 700 గ్రాముల ధాన్యం ఉండాలని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రతి కేంద్రంలో త్రాగునీరు, టెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి రైతు ఆధార్, బ్యాంక్ ఖాతా, పట్టా పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, ఫోన్ నెంబర్ తప్పనిసరి అందజేయాలని అన్నారు. తేమ శాతం వివరాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ రిపోర్టులను అందజేయాలనీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, తహసీల్దార్ మోతిరాం, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *