Release of Maha Sammelanam Pamphlets: నిర్మల్, అక్టోబర్ 26 (మన బలగం): ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తల మహా సమ్మేళనం కరపత్రాలను శనివారం నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు విడుదల చేశారు. జిల్లా ప్రచార కమిటీ సభ్యులు రవీందర్ మాట్లాడుతూ నవంబర్ 3న హైదరాబాద్లోని ఆదిభట్ల పీఎన్ఆర్ ఫంక్షన్ హాలులో మహా సమ్మేళనం ఉంటుందని, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.