Sofinagar: నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ ప్రాంతంలో వీధి దీపాలు వెలగడం లేదు. కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఒకపక్క సరస్వతి కాలువ, చుట్టూ పంట పొలాలు ఉండడం వల్ల విషసర్పాల భయం ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. వీధి దీపాల కోసం అనేకమార్లు మున్సిపాలిటీలో ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పట్టణంలో వరస దొంగతనాలు జరగడం వీధి దీపాలు లేకపోవడం వల్ల ఏ క్షణంలో ఏం జరుగుతుందో నని కాలనీవాసులు భయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.