Talent in national level karate: జాతీయస్థాయి కరాటేలో విశ్వంత్ ప్రతిభఇబ్రహీంపట్నం, నవంబర్ 6 (మన బలగం): జేకేఏ ఇండియా షోటోఖాన్ కరాటే అసోసియేషన్ జగిత్యాల నుంచి జాతీయ స్థాయి బ్లాక్ బెల్ట్ పరీక్షకు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేంద్రానికి చెందిన కరాటే విద్యార్థి విశ్వంత్ ఎంపికయ్యారు. జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ప్రధాన శిక్షకులు, ప్రధాన పరీక్షా నిర్వకులు రాపోలు సుదర్శన్ మాస్టర్ ఆధ్వర్యంలో కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో బ్లాక్ బెల్ట్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విశ్వంత్‌కు బ్లాక్ బెల్ట్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అలాగే జపాన్ బ్రౌన్ బెల్ట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వి.హారిప్రిత్, ఎ.హృషికేశ్‌లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్ మాస్టర్ ప్రశంసాపత్రాలు, బెల్టులు అందజేశారు. కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా తెలంగాణ స్టేట్ ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్, జగిత్యాల జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్, కరాటే శిక్షకులు నవీన్, పవన్ కళ్యాణ్, విశ్వంత్, కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.